మేడ్చల్‌కు 50 పడకల ఎమ్‌సిహెచ్ ఆస్పత్రి మంజూరు చేస్తాం: మంత్రి హారీశ్‌రావు

మేడ్చల్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి హరీశ్ రావు గురువారం మేడ్చల్ జిల్లాలో పర్యటించారు.జిల్లాలోని ఓప్రైవేట/ ఆస్పత్రిని హరీశ్రావు మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మేడ్చల్‌లో రూ. 10కోట్లతో 50 పడకల ఎమ్‌సిహెచ్ ఆస్పత్రిని మంజూరు చేస్తామన్నారు. ఏప్రిల్‌లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఆస్పత్రికి అవసరమైన అన్ని రకాల సిబ్బందిని కూడా నియమిస్తామన్నారు. రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాలలో ఎమ్‌సిహెచ్, ఎస్ ఎన్‌సియూ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.