రాజ‌ధానిపై కుట్ర‌లు చేసే వారిపై చ‌ర్య‌లు తప్ప‌వు.. ఎపి డిసిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

అమ‌రావ‌తి (CLiC2NEWS): రాజ‌ధానిపై కుట్ర‌లు చేసేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఎపి డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ హెచ్చ‌రించారు. రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై కృష్ణంరాజు చేసిన వ్యాఖ్య‌లపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ‌రావ‌తిలో విల‌సిల్లిన బౌద్ధాన్ని అవ‌హేళ‌న చేశారు. ఆ ప్రాంత చారిత్ర‌క‌, ఆధ్యాత్మిక సంప‌ద‌ను విస్మ‌రించ‌వ‌ద్దు. రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం భూములు ఇచ్చిన వారిలో 32% ఎస్‌సి, ఎస్‌టిలు, 14% బిసిలు ఉన్నారు. విశ్లేష‌కుడి ముసుగులో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్య‌ల వెనుక వ్య‌వ‌స్థీకృతమైన కుట్ర ఉంద‌ని.. ఇలాంటి కుట్ర‌ల‌ను ప్ర‌జ‌లు, అధికార యంత్రాంగం లోతుగా విశ్లేషించాలి. రాజ‌ధానిని, అక్క‌డి మ‌హిళ‌ల‌ను అవ‌మానించేందుకు కుటిల య‌త్నంమ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.