105 సీట్లు గెలుస్తాం..

బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా బిఆర్ ఎస్ పార్టీ 95 నుంచి 105 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామ‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బుధ‌వారం జరిగిన బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌తో ముఖ్య‌మంత్రి స‌మావేశం నిర్వ‌హిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. స‌ర్వేల‌న్నీ బిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయ‌ని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వ‌జ్ర‌పు తున‌క‌..
“తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వాలు దేదీప్య‌మానంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వ‌హించాలి.. ఈ ఉత్స‌వాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంద‌రూ పాల్గొనాలి.. దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు తెలంగాణ నే మోడ‌ల్ అని ఔరంగ‌బాద్‌లో ఒక ఐఎ ఎస్ అధికారి చెప్పారు. కులం మ‌తం పై ఏ పార్టీ గెల‌వ‌దు. అన్ని వ‌ర్గాల‌ను స‌మాన దృష్టితో చూస్తున్నాం. రానున్న ఎన్నిక‌ల్లో అధిక శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే సీట్లు.. నేను చెప్పిన‌ట్లు చెస్తే 50 వేల ఓట్ల మెజార్టీ ఖాయం..
తెలంగాణ రాష్ట్రం వ‌జ్ర‌పు తున‌క‌. ఇవాళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిస్థితి ఏమిటి.?
సింగ‌రేణి ని మొత్తం మ‌న‌మే తీసుకుంటామంటే మోడీ ఇవ్వ‌ట్లేదు. గోజ‌రాత్ మోడ‌ల్ బోగ‌స్‌.. దేశం మొత్తం తెలంగాణ మోడ‌ల్ కోరుకుంటోంది.“ అని పార్టీ నేత‌ల‌కు సిఎం కెసిఆర్ దిశా నిర్దేశం చేశారు.

Leave A Reply

Your email address will not be published.