వేలాల అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి ఇంద్రకరణ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల (CLiC2NEWS): గట్టు మల్లన్న దేవస్థాన అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని దేవాదాయ అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి ని పురస్కరించుకొని మంచిర్యాళ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని వేలాలలో గట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేలాల గ్రామం నుండి గట్టు మల్లన్న స్వామి ఆలయం వరకు రెండు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గట్టు మల్లన్న ఆలయంతో పాటు వేలాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ నల్లాల భాగ్య లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.