నాగ‌చైతన్య-శోభిత‌ల పెండ్లి శుభ‌లేఖ‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): అక్కినేని వారి ఇంట్లో పెండ్లి ప‌రులు షురూ అయిన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 4 వ తేదీన హీరో నాగ‌చైత‌న్య‌-శోభిత ధూళిపాళ్ల వివాహం జ‌రుగనున్న నేప‌థ్యంలో ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. వివాహ వేడుక‌కు బంధువుల‌ను ఆహ్వానించేందుకు ఆహ్వాన ప‌త్రిక సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ అవుతోంది. ఆహ్వాన ప‌త్రిక‌తో పాటు చీర‌, ప‌సుపుకుంకుమ‌, పూలు, స్వీట్‌, హాట్‌, వెండి వ‌స్తువులు.. వీట‌న్నింటిని క‌లిపి పెళ్లికార్డుగా ఆహ్వానం అందిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆహ్వాన ప‌త్రిక‌లో వ‌ధువు, వ‌రుడు, వారి త‌ల్లిదండ్రుల పేర్ల‌తో పాటు , వాళ్ల తాత‌య్య‌, బామ్మ‌ల పేర్లు కూడా ఉన్న‌ట్లు ఫోటో లో తెలుస్తోంది.

 

Leave A Reply

Your email address will not be published.