ప్రమాదానికి గురైన పెళ్లి బృందం ట్రాక్టురు .. 13 మంది దుర్మరణం

రాజ్‌గఢ్ (CLiC2NEWS): మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి 13 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడినట్లు సమాచారం. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ నుండి ఈ పెళ్లి బృందం వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉండటంతో భోపాల్‌కు తరలించారు.