కేర‌ళ‌లో వారాంత‌పు లాక్‌డౌన్‌!

తిరువనంతపురం (CLiC2NEWS): దేశంలో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. కేసుల పెరుగుద‌ల‌తో ప‌లు రాష్ట్రాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. కేర‌ళ రాష్ట్రంలో ఈ మ‌ధ్య కాలంలో రోజు వారీ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతోంది. దాంతో అక్క‌డి రాష్ట్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మ‌యింది. మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికోసం క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వారాంతంలో కేరళలో పూర్తి లాక్డౌన్ విధించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం అక్క‌డ నిత్యావసర సరుకులను విక్రయించే దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచబడతాయి. కేరళలో రోజుకు సగటున 17,443 కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో రోజూ నమోదవుతున్న కేసుల్లో సగం కేరళ నుంచే ఉంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.