AP: తొలిసారి సచివాలయానికి జనసేనాని

అమరావతి (CLiC2NEWS): డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తొలిసారి సచివాలయానికి వచ్చారు. ఆయనకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు జనసేనాని అమరావతిలో అడుగుపెట్టగానే రాజధాని రైతులు భారీ గజమాలతో సత్కరించారు. సీడ్ యాక్సెస్ రోడ్ అంతటా పూలబాట పరిచారు. వెంకటపాలెం నుండి మందడం వరకు దారి పొడవునా పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించేందుకు జనసేనాని వచ్చేసరికి అభిమానులు, ఉద్యోగులు, భారీ సంఖ్యలో గుమికూడారు. దీంతో ఆయన ఛాంబర్‌కు వెళ్లలేకపోయారు. రేపు ఉదయం విజయవాడ క్యాంపు కార్యాలయంలో డిప్యూటి సిఎంగా బాధ్యతులు స్వీకరించనున్నారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ ఈ భేటీలో పాల్గొన్నారు.