అమరావతిలో జస్టిస్ ఎన్వి రమణకు ఘన స్వాగతం..
అమరావతి (CLiC2NEWS): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తొలిసారి అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆయనకు ఘన స్వాగంతం లభించింది.. అమరావతి రైతుల జెఎసి సిజెఐ ఎన్విరమణకు స్వాగతం పలికింది. హైకోర్టు ప్రాంగణంలో సిజెఐ దంపతులను హైకోర్టు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులను నియమించి ఖాళీలను భర్తీ చేస్తామని ఎన్విరమణ స్పష్టం చేశారు.
కానూరు సిద్ధార్థ కళాశాలలో దివంగత జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభలో ఆయన మాట్లాడారు. జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్వగ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించారని, వాలీబాల్ తదితర క్రీడలను ప్రోత్సహించేవారని అన్నారు. నాణ్యమైన విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు అని ఆయన నమ్మేవారని తెలిపారు.