హైద‌రాబాద్‌కు చేరుకున్న రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ముకు ఘ‌న‌స్వాగ‌తం..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము న‌గ‌రానికి చేరుకున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రప‌తి హైద‌రాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్ర‌యం నుండి మొద‌ట‌గా శ్రీ‌శైలం మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నానికి వెళ్లారు. శ్రీ‌శైలంలో రూ. 43కోట్ల‌తో చేప‌ట్టిన ప్ర‌సాద్ ప‌నుల‌ను ప్రారంభించారు.

ద్రౌప‌ది ముర్ము  తిరిగి క‌ర్నూలు నుండి  హ‌కీంపేట‌కు చేరుకున్నారు. అక్క‌డ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌, గ‌వ‌ర్న‌ర్, రాష్ట్ర మంత్రులు రాష్ట్రప‌తికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం రాష్ట్రప‌తి భార‌త సైనికుల గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు.

 

ఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్‌తో పాటు సిమ్లా, హైద‌రాబాద్‌లోనూ రాష్ట్రప‌తి అధికారిక నివాసాలున్న విష‌యం తెలిసిన‌దే. రాష్ట్రప‌తి ప్ర‌తి ఏడాది శీతాకాలంలో హైద‌రాబాద్‌లోని రాష్ట్రప‌తి నిల‌యంలో విడిది చేయ‌టం ఆన‌వాయితీగా వ‌స్తుంది. నేటి నుండి రాష్ట్రప‌తి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తూ.. ఇక్క‌డినుండే కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తారు. ద్రౌప‌ది ముర్ము 27వ తేదీన రామ‌ప్ప దేవాల‌యంను సంద‌ర్శించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.