అమెరికాలో ప్ర‌ధాని మోడీకి ఘనస్వాగతం..

వాషింగ్టన్‌ (CLiC2NEWS): భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్​జిత్ సింగ్ సందు, అమెరికా అధికారులు.. ఆర్మీ బ్రిగేడియర్ అనూప్ సింగాల్​, ఎయిర్ కమాండర్ అంజన్ భద్ర, నౌకాదళ కమాండర్ నిర్భయా బప్నా విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికారు.

కాగా, ప్రవాస భారతీయులు విమానాశ్రయం వద్ద త్రివర్ణ పతాకాన్ని చేపట్టుకుని ప్రధాని మోడీకి ఆహ్వానం పలికారు. వంద మందికిపైగా ప్రవాసులు ఎయిర్‌పోర్టుకి వచ్చారు. వారికి ప్ర‌ధాని కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.