శ్రావణ లక్ష్మికి స్వాగతం

నోములు, పూజలు, వ్రతాలు
మహిళలకు ఈ మాసం నీరాజనం
శ్రావణ లక్ష్మికి స్వాగతం
ఆకాశ గగనాన అతివలు
అంతరిక్షంలో విన్యాసాలు
టోక్యో ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి బోణి
హాకీలో పరాజయాన్ని పట్టించుకోలేదెవరూ
ప్రధానితో సహా అందరి ప్రసంశలే
అబ్బాయి కావాలనే ఆరాటం తగ్గింది
అంటున్నారు అందుకే ఎవరైతేనేమని
సగర్వంగా స్వాగతం అమ్మాయికే
అబల సబలంటూ ఎందుకు తేడాలు
ఎందులో తక్కువంటూ విసురుతున్నారు సవాళ్లు
పురాణ గాథలు ,చరిత్రల ఆనవాళ్లు
ప్రత్యక్ష ఉదాహరణలు కోకొల్లలు నేడు
ఆన్వి, సాన్వి, నియారాలు, ఎవరికి ఎవరు తీసిపోరు
ఆధునిక యుగంలో అమ్మాయిలు
అంతరిక్షమే ఆటస్థలంగాఎదుగుతారు,
దివ్వెలుగా వెలుగొందుతారు
సారంగుల వంశాంకురం సొగసులు
వేళ్లూనికొని, వటవృక్షమై వర్థిల్లంగా
వివక్షత,భేదభావం,తారతమ్యం
దరి చేరరాదన్నదో మనస్సు ఆరాటం
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు
తప్పక చదవండి: విజయుడు (ధారావాహిక నవల)