శంషాబాద్​ విమానాశ్రయంలో సింధుకు ఘ‌న స్వాగ‌తం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన అనంతరం స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు హైదరాబాద్​కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఈ సంద‌ర్భంగా సింధూ మాట్లాడుతూ.. అందరి ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తోందని తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. సింధూకు శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, శాట్స్‌ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఘన స్వాగతం పలికారు.

Leave A Reply

Your email address will not be published.