నగరానికి చేరుకుంటున్న ప్రపంచ సుందరీమణులు..

హైదరాబాద్ (CLiC2NEWS): భాగ్య నగరంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ పోటీల్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు నగరానికి చేరుకుంటున్నారు. నగరానికి విచ్చేసిన అందాల భామలకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ సాంప్రదాయంలో స్వాగతం పలికారు. వారికి సిందూరం దిద్ది ఆహ్వానించారు. శంషాబాద్ విమానాశ్రయంలో మిస్ ఉక్రెయిన్, మిస్ శ్రీలంక, మిస్ కెన్యా, మిస్ బెల్జియం తదితర సుందరీమణులను సంప్రదాయ నృత్యాలు, డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు.
తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతిసారి గొప్ప అనుభూతి: మిస్ ఇండియా