నిత్య యవ్వన వంతులుగా ఉండాలంటే..

చలికాలం వచ్చింది, చలి పులిలాగా వుంది, చలికి బయపడి రాత్రి పూట త్వరగా ఇంటికి చేరుకోవటం, తెల్లవారుజామున చలికి ఆలస్యంగా లేవటం జరుగుతుంది.
కానీ ఈ చలికాలంలో వచ్చే పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు తింటే రేపు రాబోయే ఎండాకాలంలో ఎండకు, శరీరం తట్టుకుంటుంది, dehydration రాకుండా కాపాడుతుంది. కనుక మనం తీసుకునే ఆహారపదార్దాలు కాలాన్ని బట్టి తీసుకుంటే ఇమ్మ్యూనిటి పవర్ పెరుగుతుంది. రోగాలు రాకుండా ఉంటాయి. మరి అలానే ఈ కాలంలో వచ్చే ఒక అద్భుతమైన కాయ ఒకటి ఉంది అదే ఊసిరికాయ అంటారు. దీనిని సంవత్సరము అంతయును ఎదో ఒక రూపంలో తింటే పచ్చడిగా,లేక లేహ్యంగా, కాయగా, మురబ్బాగా, లేదా చవన్ ప్రాష్ లేహ్యంగా దీనిని తీసుకుంటే ఇమ్మ్యూనిటి పవర్ పెరిగి రోగాలు రాకుండా చేస్తుంది. వచ్చిన రోగాలను తగ్గిస్తుంది
ఈ ఊసిరికాయ తీసుకుంటే వచ్చే లాభాలు గురించి మరియు ఎవరు తినకూడదో ముచ్చటించుకుందాం..
ఊసిరికాయ..
వైజ్ఞానిక పేరు. Embilica officinalis గార్టన్.
ఇంగ్లీషులో.. Indian goose berry. Emblic myrobalan
సంస్కృతంలో ఆమ్లకి, ఛత్రి, ఆమ్లా,
హిందీలో… ఆమ్లా,
తెలుగులో… ఊసిరికాయ,
అరబ్బీలో… ఆమ్లాన్.. అంటారు.
ఊసిరికాయ చెట్టు భారతదేశంలో ఎక్కడపడితే అక్కడ పెరిగే చెట్టు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. దీని ఆకులు చింతకులాగా ఉంటాయి. దీని కాయలు గుండ్రంగా ఉంటాయి.కాయ మీద గుండ్రంగా ఆరు గీతాలు ఉంటాయి. దీని అర్ధం ఆరు రూతువులలో కూడా దీనిని ఆహార రూపంలో తీసుకోవచ్చు అని అర్ధం.
దీనికి ఒక ప్రత్యేకత వుంది, దీనిని సేవించిన వారికీ ముసలితనం రాదు. ఎప్పుడు యెవ్వనవంతులుగా వుంటారు. ఏందికంటే వర్షాకాలంలో వర్షానికి, ఎండాకాలంలో ఎండకు, చలికాలంలో మంచుకి మనం, మన మీద ఇవి పడకుండా మనం గోడుగు ని protection గా వాడుతాము.దీని వలన శరీరానికి హాని కాదు. జలుబు, పడిసం రావు.
దీనిని కన్నడంలో ఛత్రి ఫల్ అంటారు. ఛత్రి అంటే హిందీలో గొడుగు అని అర్ధం.గోడుగిని వాడితే ఏవిధంగా రక్షించబడుతామో, అదే విధంగా ఈ ఊసిరికాయ తీసుకుంటే అదే విధంగా శరీరం రక్షణలో ఉంటుంది, ఇమ్మ్యూనిటి పవర్ పవరుగుతుంది.ఇప్పటికైనా అర్ధమైందా మీకు ఊసిరికాయ గురించి.
దీనిలో వున్న రసాయనిక సంఘటనలు.విటమిన్ c, గాయిలిక్ ఆసిడ్, టైనిన్ ఆసిడ్, సర్కర, ఎల్బ్యూమిన్, కాల్షియం, నీరు, ప్రోటీన్, వస, ఫోస్పోరస్, లోహ, మెగ్నీషియం, పోటాషియం,ఫైబర్,ఇంకా తదితర ఉంటాయి…
ఇపుడు దీని లాభాలు గురించి చెప్పుకుందాం..
1 .కంటి problems కి,ప్రతిరోజు tea స్పూన్ చూర్ణం, తేనే సమానంగా కలిపి తీసుకుంటే కండ్లకు మంచిది. కంప్యూటర్, cell phone వాడెవరికి చాలా మంచిది.
2. తలలో చుండ్రు, వెంట్రుకలు రాలిపోవటం జరిగితే, ఊసిరికాయ, శిఖకాయ, కుంకుడుకాయ చూర్ణములు సమానంగా కలిపి తలకు స్నానం చేసేటపుడు షాంపూలకు బదులు దీనితో తల స్నానం చేస్తే హైర్స్ గ్రోథింగ్ ఉంటుంది. చుండ్రు పోతుంది.
3. స్వర భేదం… అజమోద్, పసుపు, ఊసిరికాయ,యావక్షర, చిత్రకా, విటన్నిటిని సమానంగా కలిపి ఒక tea స్పూన్ పౌడర్, ఒక tea స్పూన్ తేనే, కలిపి నాకితే స్వర భేదం పోతుంది.
4. ఎక్కిళ్ళు.. పోవాలంటే.. పిప్పళ్ళు, ఊసిరికాయ, శొంఠి, ఇవి 2-2-2 గ్రాముల చొప్పున తీసుకొని దానిలో 10 గ్రాములు కండ చక్కర, ఒక tea స్పూన్ తేనే కలిపి దీని ప్రయోగిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి.
5. వాంతులు, ఎక్కిళ్ళు వస్తే ఊసిరికాయ రసం 10 గ్రాములు మరియు 10 గ్రాములు కండ చెక్కర పౌడర్ కలిపి రోజుకి మూడు సార్లు తీసుకుంటే వాంతులు, వెక్కిళ్లు తగ్గుతాయి.
6. ఆమ్లపిత్తం… తాజా ఊసిరికాయ స్వరసం మరియు 25 గ్రాములు పటిక బెల్లం చూర్ణం దానికి తోడుగా తేనే సమానంగా కలిపి తీసుకోవాలి, పులిత్రేపులు తగ్గుతాయి. ఆమ్లపిత్తం తగ్గుతుంది.
7. కామెర్లు… కాలేయం యొక్క దుర్భలత నివారణ కొరకు ఊసిరికాయను తేనెతో కలిపి చట్నీ చేసి ఉదయం సాయంత్రం నాకిస్తే liver ప్రాబ్లెమ్ క్లియర్ అవుతుంది.
8. మూత్రకచ్చ రోగాలకు.. దీని స్వరసంలో కొద్దిగా ఇలాయిచి చూర్ణం కలిపి రోజుకి మూడు సార్లు తీసుకోవాలి.వెంటనే మూత్రకచ్చ రోగాలు తగ్గుతాయి.
9. ప్రమేహ రోగాలకు…ఆమ్ల, తానిక్కయ్య, కరక్కాయ, నాగర్ మేధ్, దారు హల్దీ, దేవదారు ఇవన్నీ కలిపి సమయాన్ని బట్టి, రోగాన్ని బట్టి దీని కాషాయం తయారుచేసి ఉదయం సాయంత్రం తీసుకోవాలి.
10. కఫ, వాత, పిత్త జ్వరాల్లో కూడా దీనిని తీసుకోవచ్చును.
11. దురదలు, గజ్జి, తామర కు దీని విత్తనాలు కాల్చి బూడిద చేసి, కొబ్బరి నూనెలో కలిపి రాస్తుంటే అవి తగ్గిపోతాయి.
12. కేవలం ఊసిరికాయ చూర్ణం, రాత్రిపూట నెయ్యితో, మరియు తేనెతో కలిపి లేదా నీటితో కలిపి తీసుకుంటే నేత్ర రోగాలు పోతాయి, నాసిక రోగాలు పోతాయి. ఇమ్మ్యూనిటి పవర్ ఫుల్ గా వస్తుంది. జఠరాగ్ని తీవ్రంగా అవుతుంది. తరువాత యెవ్వనవంతులుగా తయారు అవుతారు.
హెచ్చరిక: గర్భవతులు, low బీపీ, low షుగర్ వారు తినకపోవటం చాలా మంచిది.
ముసలితనం రాకుండా దీని చేయవచ్చును. దీని గురించి తరువాత శీర్షికలో చెపుతాను.
-షేక్. బహార్ అలీ
ఆయుర్వేద వైద్యుడు
Terrific work! This is the type of information that should be shared around the web. Shame on Google for not positioning this post higher! Come on over and visit my web site . Thanks =)