ధరణి కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ? : సిఎం

హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో ధరణిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి సిఎం, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు అధికారులు పాల్గొన్నారు. దాదాపు 2 గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్‌పై సిసిఎల్ ఎ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూములు సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 83 కోట్లు ఇచ్చిందని సిఎం అన్నారు. ఆ నిధులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా,అసైన్డ్, పట్టా భూముల వివరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్‌ను సిఎం ఆదేశించారు.