WHO: క‌రోనా వేరియంట్లు మ‌రింత ప్ర‌మాదక‌రం

జెనీవా (CLiC2NEWS): ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వేరియంట్లు మ‌రింత ప్ర‌మాదక‌రంగా మార‌డానికి ముందే మ‌హ‌మ్మారిని అదుపుచేయాల‌ని ప్రంపంచ ఆరోగ్య సంస్థ (‌WHO)దేశాల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది. ఇప్ప‌టివ‌రకు 4 ర‌కాల వేరియంట్లు వెలుగులోకి వ‌చ్చాయ‌ని WHO డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ తెలిపారు. మొద‌ట‌గా భార‌త్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ ప్ర‌పంచంలో ఇప్ప‌టివ‌ర‌కు 132 దేశాల‌కు పాకింది. ఈ వైర‌స్ తాజాగా తెలుగు రాష్ట్రాల‌లో కూడా రెండు కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిసింది.

ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ ఇలాగే రూపాంత‌రం చెందితే.. మ‌రిన్ని ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్లు ఉద్భ‌విస్తాయ‌ని టెడ్రోస్ హెచ్చ‌రించారు. గ‌డిచిన నాలుగు వారాల్లో స‌గ‌టున 80% కేసులు పెరిగాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తే మహ‌మ్మారిని అడ్డుకోవచ్చ‌ని WHO అత్య‌వ‌స‌రి విభాగ డైరెక్ట‌ర్ మైకేల్ ర్యాన్ తెలిపారు. భౌతిక దూరం, మాస్కులు ధ‌రించ‌డం, చేతులు శ‌భ్రం చేసుకోవ‌డం.. వంటి ప‌నులు నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న తెలిపారు. వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే క‌రోనా నుండి ర‌క్షించ‌గ‌ల‌ద‌ని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.