WHO: వైర‌స్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి జాగ్ర‌త్త..!

వాషింగ్ట‌న్‌ (CLiC2NEWS): ప‌లు ర‌కాల వైర‌స్‌లు, వ్యాధికార‌కాలు వేగంగా వ్యాపిస్తున్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చ‌రించింది. క‌రోనా క‌ట్ట‌డి త‌ర్వాత ప్ర‌పంచ దేశాల‌న్నీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయ‌ని.. ఈ స‌మ‌యంలో వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డిపై ప‌లు దేశాలు అల‌స‌త్యం వ‌హిస్తున్నాయ‌ని నిపుణులు అంటున్నారు. కొవిడ్‌-19, ప్లూ, శ్వాస‌కోశ వ్యాధి వైర‌స్ తో పాటు ఇత‌ర వ్యాధి కార‌కాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయ‌ని, ప్ర‌జ‌లు ఆరోగ్య జాగ్ర‌త్త‌లు పాటిస్తూ సుర‌క్షితంగా ఉండాల‌ని — సూచించింది. కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌స్తుతం 500కు పైగా ఉప‌ర‌కాలు వ్యాప్తిలో ఉన్నాయ‌నితెలిపారు. వేరియంట్ల వ్యాప్తి, రోగ‌నిరోధ‌క‌త శ‌క్తి అవి ఎలా ఎదుర్కుంటున్నాయి.. వాటి తీవ్ర‌తకు సంబంధించిన అంశాల‌పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌లోని కొవిడ్ -10 సాంకేతిక విభాగాధిప‌తి మారియా వాన్ కేర్జ్ఞోవ్ స్పష్టం చేశారు. పౌరులు సుర‌క్షితంగా ఉండేందుకు తీతుకోవాల్సిన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. వ్యాక్సిన్‌లు తీసుకోవ‌డం, మాస్కులు, భౌతిక దూరం, వెంటిలేష‌న్‌, స్వీయ ప‌రీక్ష‌లు, చేతులు శుభ్ర‌ప‌ర‌చుకోవ‌డం వంటి జాగ్ర‌త్తలు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలని WHO సూచించింది.

1 Comment
  1. zoritoler imol says

    After study a few of the blog posts on your website now, and I truly like your way of blogging. I bookmarked it to my bookmark website list and will be checking back soon. Pls check out my web site as well and let me know what you think.

Leave A Reply

Your email address will not be published.