పదిమంది పిల్లల్నికంటే.. మిలియన్ రూబెల్స్

మాస్కో (CLiC2NEWS): పదిమంది పిల్లల్ని కంటే.. మహిళలకు బంపర్ అఫర్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యాలో జనాభా పెంచుకోవడం కోసం ఆ దేశాధ్యక్షుడు భారీ నజరానా ప్రకటించాడు. పదిమంది అంతకంటే ఎక్కవ పిల్లలను కనే మహిళలకు మిలియన్ రూబెల్స్ (భారత కరెన్సీలో దాదాపు 13 లక్షలకు పైన) నజరానా ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు మదర్ హీరోయిన్ అవార్డును గత సోమవారం ప్రకటించినట్టు సమాచారం. అయితే.. ఈ మెత్తాన్ని 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజు నాడు చెల్లిస్తారని, అప్పటికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు పెట్టారు.
రష్యాలో గత కొంతకాలంగా జనాభా తగ్గుతోంది. కరోనాతో పాటు ఉక్రెయిన్పై యుద్ధం కూడా ఒక కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. యుద్ధం కారణంగా వేలాది మంది క్రెమ్లిన్ సైనికులు మరణించిన విషయం తెలిసినదే. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 15 వేల మంది రష్యా సైనికులు మరణించి ఉంటారని అంచానా. దేశంలో జనాభాను పెంచడం కోసం పుతిన్ సర్కార్ ఈ అవార్డును ప్రకటించింది.