ప్రభుత్వ జీఓలు వెబ్సైట్లో ఉంచడానికి ఇబ్బందేంటి?: హైకోర్టు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన దళిత బంధు పథకంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ పథకం అమలు తీరుపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. జీవో ఇచ్చిన 24 గంటల్లోనే వెబ్సైట్లో ఉంచాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.
వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వాసాలమర్రిలో దళిత బంధు అమలును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి తో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారని పిటిషన్లో ఆరోపించారు.
అయితే, దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందని ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ తెలిపారు. నిబంధనలు ఖరారు చేసినట్లు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. అయితే, నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్సైట్లో లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు.. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏజీ వివరణను నమోదు చేసిన కోర్టు.. వాసాలమర్రిలో దళిత బంధు అంశంపై విచారణను ముగించింది. జీవోలన్నీ 24 గంటల్లోగా ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించింది.
దీనిపై అడ్వకేట్ జనరల్ (ఎపి) బిఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేసినట్లు కోర్టుకు తెలిపారు. దీనికి స్పందించిన కోర్టు పిటిషన్లో ఆ నిబంధనలు ఎందుకు జతచేయలేదని ప్రశ్నించింది.
పథకానికి సంబంధించిన జీఓ ప్రభుత్వ వెబ్సైట్లో లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ న్యాయస్థానికి వివరించారు. ప్రభుత్వ జీఓలు వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. జీఓలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోర్టు చెప్పింది. ఈ మేరకు ఎజి ప్రసాద్ వివరణ నమోదు చేసిన కోర్టు దళితబంధుపై దాఖలైన పిటిషన్పై విచారణ ముగించింది.
Aucun remboursement ne sera potential dès lors que l’étudiant aura accédé au moins une fois à la plateforme de formation en ligne pour commencer
la formation.