అటవీ ప్రాంతం దగ్థం.. రహదారులపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు

శాంటియాగో (CLiC2NEWS): అక్కడ అటవీ ప్రాంతమంతా దగ్ధమయిపోయింది. వేడి గాలులకు వేల ఎకరాలు బూదిదయ్యాయి. అగ్నికీలలు వేగంగా వ్యాప్తి చెందుతూ రోడ్లపైకి వస్తున్నాయి. ఈ ఘటన లాటిన్ అమెరికా దేశమైన చిలీలో చోటుచేసుకుంది. చిలీ రాజధాని శాంటియాగోకు 500 కిలోమీటర్లు దూరంలో సుమారు 14 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైపోయింది. అటవీ ప్రాంతంలో వ్యాపించిన మంటలు వేగంగా వ్యాప్తి చెందుతూ రహదారులపైకి రావడంతో ప్రజలు బయభ్రాంతులకు గురవుతున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో 13 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. అత్యవసర సేవల బృందానికి చెందిన హెలికాప్టర్ సయితం కూలిపోయి ఇద్దరు మరణించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.