యోగా డే కు హాజ‌ర‌వుతా ప్ర‌ధాని మొడీ..

అమ‌రావ‌తి (CLiC2NEWS): జూన్ 21వ తేదీన విశాఖ‌లో జ‌ర‌గ‌నున్న యోగా డేలో పాల్గొంటాన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఆయ‌న అమ‌రావ‌తి పునఃప్రారంభ ప‌నుల‌కు శుక్ర‌వారం శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో మోడీ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విశాఖ‌లో జ‌ర‌గ‌నున్న యోగా డేలో పాల్గొంటాన‌న్నారు. మ‌న యోగాకు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంద‌ని, వ‌చ్చే 50 రోజులూ ఎపిలో యోగాకు అనుకూల వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌న్నారు.

ఎపి స‌రైన మార్గంలో న‌డుస్తుంద‌ని, స‌రైన వేగంతో ముందుకెళ్తోంద‌ని మోడీ అన్నారు. ఎపిలో క‌లలు క‌నేవాళ్ల సంఖ్య‌.. ఆ క‌ల‌ల్ని నిజం చేసేవారి సంఖ్య త‌క్కువేం కాద‌న్నారు. మూడేళ్ల‌లో అమ‌రావ‌తి ప‌నుల్ని పూర్తి చేస్తామ‌ని సిఎం చంద్ర‌బాబు అన్నార‌న్నారు. ఆ ప‌నులు పూర్త‌యితే ఎపి జిడిపి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించ‌గ‌ల‌నన్నారు. అది రాష్ట్ర చ‌రిత్ర గ‌తి మార్చుతుంద‌ని, ఎపి అభివృద్ధిలో తాను పాలుపంచుకుంటాన‌ని ఈ సంద‌ర్భంగా మోడీ తెలిపారు.

భార‌త శ‌క్తి అంటే కేవ‌లం మ‌న ఆయుధాలే కాదు.. మ‌న ఐక్య‌త కూడా అని మోడీ అన్నారు. విక‌సిత్ భార‌త్ నిర్మాణానికి మ‌హిళ‌లు, కార్మికులు అభివృద్ధి చెందాలి. ఎపిలో 70కి పైగా రైల్వే స్టేష‌న్లు ఉన్నాయ‌ని తెలిపారు. గ‌త ప‌దేళ్ల‌లో ఎపిలో 750 రైల్వే బ్రిడ్జిలు , అండ‌ర్ పాస్‌లు నిర్మించామ‌న్నారు. ఒక‌ప్పుడు తెలుగు రాష్ట్రాల‌కు రైల్వే బ‌డ్జెట్ రూ.900 కోట్ల లోపు ఉండేద‌ని.. కానీ ఇపుడు కేవ‌లం ఎపికే రూ.9వేల కోట్లు రైల్వే నిధుల ఇచ్చామ‌ని మోడీ తెలిపారు. పోల‌వరం త్వర‌గా పూర్త‌య్యేందుకు క‌లిసి ప‌నిచేస్తామని ప్ర‌ధాని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.