అభివృద్ది కోసం సిఎంను కలిస్తే తప్పేంటి.. మల్లారెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలుస్తానని బిఆర్ ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఆ షాక్ నుండి ఇంకా తీరుకోలేదన్నారు. అభివృద్ధికోసం సిఎంను కలుస్తానని.. తప్పేంటని ప్రశ్నించారు. గతంలో టిడిపిలో ఇద్దరం కలిసి పనిచేశామని గుర్తుచేశారు. మల్కాజిగిరి ఎంపిగా పోటి చేయాలని మా పార్టి నేతలు అడిగారని, నా కుమారిడికి ఎంపి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరానని అన్నారు. రాజకీయ చర్చకు తావు లేకుండా సిఎంను కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తానని మల్లారెడ్డి అన్నారు.