కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
రెండు రోజుల్లో సిఎం పదవికి రాజీనామా చేస్తా: ఢిల్లీ ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రెండురోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అలాగే తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకూ ముఖ్యమంత్రి పదవిలో ఉండనని ప్రతిజ్ఞ చేశారు. ఆప్ నుంచి మరొకరు సిఎం అవుతారని, కొత్త సిఎం ఎంపిక కోసం రెండు , మూడు రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని కేజ్రీవాల్ తెలిపారు.
ఆప్ లో చీలికలు తెచ్చి ఢిల్లీలో అధికారంలోకి రావాలని బిజెపి కుట్రలు పన్నిందని.. ఆప్‌ను ముక్కలు చేసేందుకే తనను జైలుకు పంపారు అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఫిబ్రవరిలో జరుగనున్న ఢిల్లీ ఎన్నికలను నవంబరులో మహారాష్ట్రతో పాటు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. తాను నిర్దోషిన అని నమ్మితే ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. వారే అంతిమ న్యాయ నిర్ణేతలని కేజ్రీవాల్ అన్నారు.