Winter Tips: అందమైన ముఖ సౌందర్యం కోసం సహజ చిట్కా..
సౌందర్య ముఖం కొరకు చక్కని శరీరానికి ఆరోగ్యవంతంగా ఉండటానికి చేయవల్సిన చిట్కా..
పుట్టిన ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని, ముఖం మీద చిన్న నల్ల మచ్చ కూడా ఉండకూడదని, ముఖం నిగ నిఘాలడాలని అందరు కలలు కంటారు.
చలికాలంలో చలి వలన పేస్, స్కిన్, డ్రైనెస్ రావటం జరుగుతుంది. పేస్ గ్లోయింగ్ గా ఉండాలని, ఎక్కడ చర్మం మరియు పెదవులు, కాళ్ళ పాదాలు పగలకుండా అందంగా ఉంచుకోవటానికి వెన్నని ఉపయోగించండి.
వెన్న ఇది అన్ని రకాల స్కిన్ రోగాలకు మంచిగా ఔషదం లాగా పనిచేస్తుంది. వెన్న లో విటమిన్ E ఉంటుంది. ఇది స్కిన్ మీద వున్న ఫిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది. స్కిన్ గ్లోయింగ్ కూడా వస్తుంది.స్కిన్ లో కోలోజిన్ కూడా తయారు అవుతుంది. కొలోజిన్ ఒక రకమైన ఫైబర్, ముఖం మీద వచ్చే మొటిమలు కూడా రానివ్వకుండా చేస్తుంది. చర్మాన్ని, సౌందర్యంగా ఉంచటంలో కీలక పాత్ర వహిస్తుంది.
ముందుగా వెన్న దీనిలో కొద్దిగా జైతున్ నూనె, కొద్దిగా తేనే కలిపి ఒక సీసాలో పెట్టి మూత బిగించి పెట్టాలి. తరువాత రాత్రి నిదురించే ముందు దీనిని పేస్ కి రాసి మసాజ్ చేసి పడుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి. చాలా చమత్కరంగా ముఖం నిగ నిగలాడుతుంది. నల్ల మచ్చలు, మొటిమలు పోతాయి.
హెచ్చరిక మీ స్కిన్ డ్రై నా, ఆయిల్ స్కిన్ నా అనేది డాక్టర్ సలహా మేరకు అడిగి తెలుసుకొని దీనిని అప్లై చేయాలి. ఆలా కాకుండా చేస్తే దుష్పరిణామాలు కూడా వస్తాయి.
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు