ఎయిరిండియా కొత్త తరహా సేవలు
Air India: ఎయిరిండియా ప్రయాణికుల కోసం కొత్త తరమా సేవల్ని తీసుకొచ్చింది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తమ ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు విస్తా పేరుతో కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. వైర్లెస్ ఇన్‌ప్లైట్ ఎంటర్టైన్మెంట్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు బుధవారం ప్రకటించింది. ముందుగా వైడ్-బాడీ విమానాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. బ్లూబాక్స్ వావ్ వైర్లెస్ నెట్వర్క్ సిస్టమ్ ద్వారా ఈ సర్వీసులను అందిస్తుంది. దీంతో ప్రయాణికులు ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను నేరుగా వారి డివైజుల్లోనే వీక్షించవచ్చు. రియల్ టైమ్ ఫ్లైట్ ట్రాకింగ్ కోసం లైవ్ మ్యాప్ కూడా విస్తా డిస్ప్లే చేస్తుంది.
ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ కొ్త్త తరహా సేవల్ని ప్రారంభించనున్నారు. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్, మ్యాక్ ఓఎస్ డివైజుల్లో ఈ సేవలు పొందవచ్చు. దీనిలో మొత్తం 950 గంటలకు పైగా ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను జోడించింది. తొలుత వైడ్-బాడీ విమానాలకే పరిమితమైన ఈ సేవలు.. త్వరలో చిన్న విమానాలకు సైతం విస్తరించనున్నట్లు సమాచారం.