రైతుబంధు అనుమతి ఉపసంహరణ.. కాంగ్రెస్సే కారణమంటున్న నేతలు..

హైదరాబాద్ (CLiC2NEWS): ఈ నెల 28వ తేదీ లోపు రైతుబంధు నిధులు పంపిణీ చేసేందుకు ఇటీవల ఇసి అనుమతించిన విషయం తెలిసిందే. తాజాగా అనుమతిని ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్ ఆరంభానికి ముందు నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిధుల జమ జరగలేదు. యథావిధిగా ఈ నిధుల పంపిణీ కొనసాగించాడినికి అనుమతి కోరుతూ రాష్ట్రప్రభుత్వం ఇసికి లేఖ రాసింది. మూడురోజుల క్రితం నిధుల మంజూరుకు షరతులతో కూడిన అనుమతిచ్చింది. ఎక్కడాకూడా ప్రజార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని.. లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయెద్దని షరతు విధించింది. అయితే మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ.. తాజాగా ఇసి అనుమతిని ఉపసంహిరించుకుంది. దీంతో 70 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం నిలిచిపోయింది.
రైతుబంధు నిలిచిపోవడానికి కారణం కాంగ్రెస్సేనని మంత్రి హారీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతోనే ఇసి ఇచ్చిన అనువతిని నిరాకరించారని హరీశ్‌రావు ఆరోపించారు. రైతుబంధుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. కాంగ్రెస్ వాళ్లు రైతులకు వాళ్లు ఇవ్వరు.. ఇచ్చేటోళ్లకి అడ్డుపడుతుంటారన్నారు. ఎంతకాలం ఆపగలరు.. మహా అయితే డిసెంబర్ 3వ తేదీ వరకు ఆపగలరని, మళ్లీ కెసిఆరే ఇచ్చేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలే ఇసి వెంటపడి మరీ రైతుబంధును ఆపించారని ఎమ్మెల్సైఈ కవిత ఆరోపించారు. ఆన్నదాత నోటికాడి ముద్దను లాగేశారని ఆమె విమర్శించారు.