అన్ని విభాగాల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం స‌త్ఫ‌లితాల‌నిస్తుంది: రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము న‌గ‌రంలోని స‌ర్ధార్ వల్ల‌భాయ్ ప‌టేల్ పోలీస్ అకాడ‌మీని సంద‌ర్శించారు. అకాడ‌మీలో ఐసిఎస్ శిక్ష‌ణ తీసుకుంటున్న అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రప‌తి మాట్లాడుతూ.. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌టంలో పోలీసులు కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని, ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కుండా వారి సేవ‌లు అమూల్య‌మ‌ని ద్రౌప‌ది ముర్ము కొనియాడారు. పోలీసుల‌కు నిజాయితీ, అప్ర‌మ‌త్త‌త‌, సున్నిత‌త్వం అవ‌స‌ర‌మ‌ని సూచించారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌ల‌కు వారు అండ‌గా నిల‌వాల‌న్నారు. ఏ విభాగంలోనైనా మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుందని.. అన్ని రంగాల్లో వారిని ప్రోత్స‌హించాల‌న్నారు. నారీశ‌క్తి అన్ని విష‌యాల్లో దృడంగా మారేందుకు దేశ నాయ‌క‌త్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, మ‌హిళ‌ల‌కు అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం దేశ స‌మ‌గ్రాభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. ఇంగ్లాండ్‌, నార్వే, స్వీడ‌న్‌, డెన్మార్క్ దేశాల్లోని పోలీసుల‌లో 30%మంది మ‌హిళ‌లే ఉంటార‌ని రాష్ట్రప‌తి ఈ సంద‌ర్బంగా తెలియ‌జేశారు.

2 Comments
  1. 세종출장안마 says

    After exploring a handful of the blog posts on your web
    site, I truly appreciate your technique of writing a blog.
    I book marked it to my bookmark site list and will be checking back in the
    near future. Take a look at my web site too and tell me what
    you think.

  2. This is a topic which is close to my heart… Take care!

    Where are your contact details though?

Leave A Reply

Your email address will not be published.