మహిళా రిజర్వేషన్ బిల్లు.. మోడీ సారథ్యంలో కేబినేట్ ఆమోదం
ఢిల్లీ (CLiC2NEWS): చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం ఆమోదం పలికింది. ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బిల్లుకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపింది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్ సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలవుతాయి. ఈ బిల్లు 1996లో హెచ్‌డి దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అనంతరం వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ సర్కార్‌ల హయాంలో కూడా ప్రవేశపెట్టారు. కానీ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. 2010లో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో పెండింగ్‌లో ఉండిపోయింది.