మహిళా రిజర్వేషన్ బిల్లు.. లోక్ సభ ఆమోదం..

ఢిల్లీ (CLiC2NEWS): మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అథినియమ్ అనే పేరుతో ఈ బిల్లును కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించగానే లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్రన్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నిన్న ప్రవేశపెట్టగా.. ఈ చారిత్రక బిల్లుపై నేడు చర్చ జరిగింది. దీనికి ఓటింగ్ నిర్వహించగా.. 454 మంది ఎంపిలు అనుకూలంగా.. రెండు వ్యతిరేక ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. మాన్యువల్ పద్ధతిలో ఎరుపు, ఆకుపచ్చ రంగుగల స్లిప్పులు ఇస్తారు. బిల్లుకు మద్ధతు పలికే వారు ఎస్ అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలి. వ్యతిరేకించే వారు నో అని ఎరుపు రంగు స్లిప్పుపై రాయాల్సి ఉంటుంది.