మహిళల టి20 ప్రపంచకప్: శ్రీలంకపై భారత్ విజయం

దుబాయి (CLiC2NEWS): టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై భారత్ మహిళ జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. మహిళల టి20 ప్రపంచక ప్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతున్నది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టును 90 పరుగులకే ఆలౌట్ చేసింది.
భారత్ బ్యాటర్లలో హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. స్మృతి మంధాన 50 అర్ధశతకం చేసింది. షెఫాలి వర్మ 42 పరుగులతో రాణించారు.