wonder: ఒకే కాన్పులో 9 మంది జ‌న‌నం..

మాలి (CLiC2NEWS): ఒకే కాన్పులో క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం చూశాం. ఇంకొంత మంది ఒకే కాన్పులో ముగ్గురు, న‌లుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం చూశాం. అదే పెద్ద వండర్ అనుకున్నాం. కానీ, ఒకే కాన్పులో 9మందికి జన్మనివ్వడం చూశారా? 25 ఏళ్ల మ‌హిళ చరిత్ర సృష్టించింది. ఏకంగా ఒకే కాన్పులో 9 మందికి జ‌న్మ‌నిచ్చి యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. ఆఫ్రికాలోని మాలిలో వండ‌ర్ చోటుచేసుకుంది.

మంగ‌ళ‌వారం ఓ మ‌హిళ ఒకే కాన్పులో 9 మంది శిశువుల‌కు జ‌న్మ‌నిచ్చింది. కాగా త‌ల్లీపిల్ల‌లు… అంద‌రూ క్షేమంగా ఉన్నారు. మాలీకి చెందిన హాలిమా సిస్సే (25) అనే మ‌హిళ గ‌ర్భం దాల్చ‌గా మార్చిలో ఆమెను ప‌రీక్షించిన వైద్యులు ఆమె గ‌ర్భంలో ఏడుగురు శివువులు ఉన్న‌ట్లు తెలిపారు. ఒకే సారి క‌డుపులో ఏడుగురు శిశువులు ఉండ‌టంతో వైద్యులు ఆమెను ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచి నిరంత‌రం ప‌ర్య‌వేక్షించారు. మంగ‌ళ‌వారం హాలిమా సిస్సేకి డెలివ‌రి డేట్ రావ‌డంతో శ‌స్త్రచికిత్స నిర్వ‌హించారు. అద్భుతమేంటంటే.. వైద్యులు ప‌రీక్ష‌ల్లో గుర్తించ‌న‌దానికంటే ఇద్ద‌రు శివువులు అద‌నంగా జ‌న్మించడంతో వారు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. హాలిమా సిస్సేకి మొత్తం తొమ్మిది మంది జ‌న్మించారు. జ‌న్మించిన వారిలో న‌లుగురు మ‌గ‌వారు, ఐదుగురు ఆడ‌శిశువులు ఉన్నారు. కాగా త‌ల్లీపిల్ల‌లు అంద‌రూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ మేర‌కు మాలీ ఆరోగ్య‌శాఖ మంత్రి ఫాంటా సిబే ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇది నిజంగానే ఒక అద్భుత‌మ‌ని మాలి వైద్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.