వాటర్ ట్యాంకు పైప్‌లైన్‌లో ఇరుక్కొని కార్మికుడి మృతి
ఖమ్మం (CLiC2NEWS): మిషన్ భగీరథ ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకును శుభ్రం చేస్తూ కార్మికుడు ప్రమాదవ శాత్తూ పైప్‌లైన్‌లో ఇరుక్కొని మృతి చెందాడు. నగరంలోని నయాబజార్ పాఠశాల పక్కనే ఉన్న మిషన్ భగీరథ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును శుభ్రం చేసేందుకు మంగళవారం ఇద్దరు కార్మికులతో కలిసి చిర్రా సందీప్ (23) ఎక్కాడు. శుభ్రం చేసిన అనంతరం అతని కాలు ట్యాంకు నుండి నగరానికి నీటి సరఫరా అయ్యే పైపులైన్‌లో ఇరుక్కుంది. ట్యాంకు మోకాళ్ల లోతు నీళ్లుండగా, ఒక్క సారిగా ప్రవాహం రావడంతో పైపులోకి వెళ్లిపోయాడు. నీ ఉద్ధృతికి జారతాడనుకొని కొందరు వాల్వు తిప్పగా.. కిందవరకు వచ్చి అందులోనే ఇరుక్కుపోయాడు. అప్పటికే ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది.
సందీప్ మృత దేహాన్ని వెలికితీయడానికి అధికారులు, సిబ్బంది సుమారు 5 గంటల పాటు శ్రమించారు. జెసిబి సాయంతో పైప్‌లైన్ పగలగొట్టారు. సందీప్ నగరపాలక సంస్థలో పొరుగుసేవల పద్ధతిలో వాటర్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు.