మళ్లీ ‘వర్క్‌ఫ్రమ్ హోమ్’ అమలు!

హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్నందున ఐటి ఉద్యోగులు ఇంటి వద్ద నుండే పని చేయాలని పలు ఐటి సంస్థల యాజమాన్యాలు సూచిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఉద్యోగులు కార్యాలయాలకు రావడం ప్రారంభించారు. దాదాపుగా అక్టోబరు నుండి అన్ని రకాల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. కానీ నవంబరు నాలుగో వారం నుండి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న కారణంగా కార్యాలయాలకు రావొద్దంటూ, ఆయ సంస్థల యాజమాన్యాలు సూచిస్తున్నారు. దీంతో ఇంకొంత కాలం ‘ఇంటినుంచే పని’ క్షేమమని కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.