ఎపి సిఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం భేటీ
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సమావేశమైంది. గత రెండు రోజులుగా అమరావతిలో ఈ బృందం పర్యటిస్తుంది. అమరావతిలోని భవనాలు, రహదారులను పరిశీలించింది. నేడు సిఎంతో సమావేశమైన ఈ బృందం రాజధాని నిర్మాణంపై చర్చించినట్లు సమాచారం. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజిని ఉపయోగించి అమరావతి నిర్మిస్తున్నామని ఆ బృందానికి సిఎం వివరించారు. ఈ సమావేశంలో వరల్డ్ బ్యాంకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలీవియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్ షెన్, సౌత్ ఆసియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలి రజాక్ ఎఫ్.ఖలీల్ ఉన్నారు. సిఎం తోపాటు మంత్రి పి. నారాయణ, సిఆర్‌డిఎ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఈ భేటీలో పాల్గొన్నారు.