నవంబర్ 14 వరల్డ్ డయాబెటిస్ డే
World Diabetes Day

మన శరీరంలోని పాంక్రియాజ్ (పాంక్రియాజ్ లోని బీటా కణాలైన హైలైట్స్ ఆఫ్ లంగర్స్ హన్స్ కణాలు ఇన్సులిన్ విడుదల చేస్తుంది ) ఇన్సులిన్ విడుదల చేయకపోవటం లేదా అతి తక్కువగా విడుదల కావటం, వలన గ్లూకోస్ కాలేయంలో గ్లైకోజెన్ గా మార్పు చెందదు. ఈ కారణంగా శరీరానికి శక్తి లభించదు. ఇలా పేరుకోపోయిన గ్లూకోస్ రక్తంలో కలిసిపోయే స్థితిని మధుమేహం అంటారు. డయాబెటీస్ అంటారు.
ఈ జబ్బు స్తులకాయం వున్న వారికీ మరియు కాలేయ వ్యాధులు వున్న వారికీ ఏ పని చేయక చక్కగా కూర్చోని తినే వారికీ, శారీరక శ్రమ చేయని వారికీ, ఏడ్రినల్, థైరాయిడ్,పాంక్రియస్ గ్రందులు వ్యాధులు కలవారిలో డౌన్స్ సిండ్రోమ్స్, టర్నర్స్ సిండ్రోమ్స్,కల వారిలో, మస్క్యూలర్ డిస్టఫి కల వారిలో మరియు కార్దికోస్థిరయిడ్స్ మందులు వాడే వారిలో మధుమేహం వచ్చే అవకాశం వుంది. మరియు వంశపారపర్యంగా కూడా వస్తుంది.
వ్యాధి లక్షణాలు..
- అతిగా దప్పిక వేయటం,
- అతిగా ఆకలి వేయటం,
- అతిమూత్ర విసర్జన..
దురద, మర్మావయవాల దగ్గర దురద, శిస్నమ్ పుండుగా మారటం, కాళ్ళ పిక్కల నొప్పి, తిమ్మిర్లు, మంటలు, మొద్దు భారటం, బలహీనత, కంటిచూపు మందగించటం, సెగ గడ్డలు లేచుట, సెక్స్ బలహీనత, బరువు కోల్పోవటం.
చికిత్స…
1. ఆల్కహాల్, దూమపానం మానివేయాలి.
2. తీపి పదార్దాలు, పిండి పదార్ధాలు తినకూడదు.
3. నడక, yoga, వ్యాయామం చేయాలి.
4. ఇష్టం వచ్చినట్లు తినకూడదు. రోజుకు మూడు సార్లు తినే ఆహారం ఆరు పూటలు కొద్దిగా, కొద్దిగా, కడుపు నిండా, బిగించి తినకూడదు.
5. టీ డైలీ షుగర్ లేకుండా రెండు సార్లు తాగాలి.
6. నోరు తిండి విషయంలో ఎంత అదుపులో ఉంటే షుగర్ కూడా అంతే అదుపులో ఉంటుంది.
ఆయుర్వేద చిట్కా:
కాకరకాయ జ్యూస్, వేపాకు జ్యూస్ సమ భాగాలు కలిపి భోజనానికి అర గంట ముందు udayam/సాయంత్రం పరిగడుపున తాగాలి. మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు,
సెల్ 7396126557