గుండె జారీ గల్లంత‌య్యిందే!

World heart day 29-09-2022

ఇప్పుడు గుండె గురించి చెప్పుకుందాం.

శరీరం పెరుగుదల నిర్వహణ కోసం అన్ని జీవులకు పోషకాలు, వాయువులు, మరియు ద్రవ్యపదార్దాలు, మొదలైనవి అవసరం. శరీరంలో ద్రవపదార్దాల రవాణా కొరకు ప్రత్యేక రక్తప్రసరణ వ్యవస్థ వుంది. దానిలో గుండె, రక్తానాళాలు ముఖ్య పాత్ర వహిస్తాయి.

గుండె బేరిపండు ఆకారంలో త్రికోణాకారంగా ఉంటుంది. పై వైపున వెడల్పుగాను,కింద వైపున సన్నగా ఉంటుంది.

గుండెని అవరించి రెండు పొరలు ఉంటాయి. వీటిని “హృదయావరణ త్వచాలు అంటారు. ఈ రెండు పొరల మధ్యభాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఇది గుండెను అఘాతల నుండి కాపాడుతుంది.

గుండె లోపల వుండే ఉబ్బేత్తు నిర్మాణాలు గుండెను నాలుగు భాగాలుగా బిభజిస్తాయి. పై రెండు భాగాలను కర్ణికలు, కింది రెండు బాగాలను జఠరికలు అని అంటారు. గుండె గోడలకు ఆంటీపెట్టుకొని ఉన్న రక్తనాళలను కరోనరి రక్తనాళాలు అంటారు. ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.

పైన వున్న కర్ణికలు గోడలు పలుచగాను, కింద వైపు వున్న జఠరికలు గోడలు మందంగాను ఉంటాయి. గుండెలో నాలుగు గదులుంటాయి. ఎడమ వైపు ఉన్న రెండు గదులలో ఒకటి పైవపునకు పూర్వాతం వైపు రెండొవది కిందవైపుకు పరాంతం వైపుకు ఉంటాయి. అదే విధంగా కుడివైపు కూడా రెండు గదులుంటాయి.

దృడంగా ఉన్న రక్తనాళాలను దమనులు అంటారు. ఇవి హృదయం నుండి బయలుదేరి శరీర బాగాలన్నింటికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. అతిపెద్ద దమని బృహద్దమని అంటారు. చిన్న దమనిని పుపుస దమని అంటారు. ఇది రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసుకోపోతుంది.

తక్కువ దృఢత్వం కలిగిన నాళాలను సిరలు అంటారు. ఇవి శరీర బాగాల నుండి రక్తాన్ని హృదయానికి తీసుకొని పోతాయి. గుండెకు పై భాగంలో కుడివైపుకు ఉండే పెద్ద సిరను superrior venecava అంటారు.ఇది శరీరం పై బాగాల నుండి (thala) రక్తాన్ని సేకరిస్తుంది. గుండె కుడివైపు దిగువ భాగంలో కనిపించే సిరను అదో బృహత్ సిర అని అంటారు. ఇది శరీరం దిగువ బాగాల (కాళ్లు, చేతులు )నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి తీసుకోవస్తుంది.

ఎడమ వైపు వున్న కర్ణిక, జఠరికలు, కుడివైపు వాటికంటే చిన్నవిగా ఉంటాయి. రెండు కర్ణికలు, రెండు జఠరికలు కండరయుతమైన విభాజాకాలతో వీరు చేయబడి ఉంటాయి. కర్ణికలు, జఠరికలు మధ్య కవాటయుతమైన రంద్రాలున్నాయి.

కుడి కర్ణికలో పూర్వఫర మహసిరలు తెరుచుకునే రంద్రాలున్నాయి. ఏడమ కర్ణికలో ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకోవచ్చే పుపుస సిరలు తెరుచుకునే రంద్రాలు ఉంటాయి.

ఎడమ జటరిక పై భాగం నుండి ఒక లావుపాటి రక్తనాళం బయలుతేరుతుంది. ఈ పెద్ద దమనిని బృహద్దమని లేదా దమనీచాపం అంటారు. దమనీచాపం శరీర బాగాలకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. కుడి జటరిక పై భాగం నుండి పుపస దమని అనే రక్తనాళం బయలుతేరుతుంది. ఇది ఆమ్లజనిరహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది.

రక్తనాళాలు మరియు రక్తప్రసరణ వ్యవస్థ..

రక్తనాళాలో రక్తం ఒకేదిశలో ప్రవహించటానికి రక్తనాళాలు గోడల వెంబడి కవాటాలు తెరుచుకొని ఏ విధమైన అంటంకాన్ని కలిగించకుండా ఉంటాయి. కానీ రక్తం ఒకేవేళ వ్యతిరేక దిశలో ప్రవహించటానికి చూస్తే కవాటలు మూసుకొని నాళాన్ని మూసివేసి రక్తప్రవాహాన్ని ఆపేస్తాయి.
అంటే అవి ఎకదిశా కావాటాలన్న మాట. వ్యక్తి నిలబడినపుడు ఇవి రక్తం పై దిశలో ప్రవహించటానికి తోడ్పడుతాయి. అంతేకాని కింద దిశలో ప్రవహింపనీయవు.
కవాటాలనేవి రక్తాన్ని కర్ణికల నుండి జటరికలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవహింపచేస్తాయి.గుండె సంకొచించినపుడు రక్తం జటరికల నుండి కర్ణికలకు చేరటానికి బదులుగా రక్తనాళాల్లోకి వెళుతుంది.
రక్తానికి రెండు ప్రవాహాలు వున్నాయి. దీనినే ద్వివలయ రక్తప్రసరణ అని రక్తం కుడి జటరిక నుండి దమనుల ద్వారా ఊపిరితిత్తులకు చేరి అక్కడ నుండి సిరల ద్వారా ఎడమ కర్ణికలకు చేరుతుంది. ఎడమ కర్ణిక నుండి, ఎడమ జటరికకు చేరి దమనుల ద్వారా శరీర బాగాలకు ప్రవహించి తిరిగి సిరల ద్వారా కుడి జటరికలోకి చేరుతుంది. ఈ విధంగా రక్తం గుండె నుండి బయలుతేరి మరలా గుండెకు చేరితుందన్న మాట.
ఆ సన్నని రక్తనాళాలకు సూక్ష్మ కేశనాళికలు అని లాటిన్ భాషలో కేశం అని అర్ధం. ఎందుకంటే ఆ నాళాలు కూడా వెంట్రుకల వలె సన్నగా ఉంటాయి.

దమనులు, సిరలు,
రక్తనాళాలను దమనులు సిరలు అని రెండు రకాలుగా విభజించవచ్చును. దమనులు హృదయం నుండి రక్తాన్ని శరీర బాగాలకు సరఫరా చేస్తాయి. దీనికి వ్యతిరేకంగా సిరలు శరీర బాగాల నుండి రక్తాన్ని హృదయానికి తీసుకువస్తాయి.

క్తకేశనాళికలు
రక్త కేశనాళికలు ఏక కణ మందంతో నిర్మితమైన సూక్ష్మమైన నాళాలు. ఇవి తమ గుండా పదార్దాలు వ్యాపనం చెందటానికి అనుమతినిస్తాయి. తెల్ల రక్త కణాలలోకి ల్యూకో సైట్లు, సూక్ష్మ కేశనాళికలు గోడల గుండా చోచ్చుకొనిపోగలవు. ఇవి దమనులు సిరలు కలుపుతూ రక్త కేశణాళిక జాలాన్ని ఏర్పాటు చేయటానికి తోడ్పడుతాయి..
హార్దికవలయం
Cardiac cycle
గుండె స్పందించటం ఆగిపోతే మరణం సభవిస్తుంది.
కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యధాస్థితికి వస్తే దానిని ఒక హృదయ స్పందన వలయం లేదా హార్దిక వలయం అంటారు.
1. పూర్వపర మహాసిరల రక్తం నుండి కుడికర్ణికలోనికి, పుపస సిరల నుండి ఎడమ కర్ణికలోనికి రక్తం ప్రవేశిస్తుంది.
2. ఇప్పుడు కర్ణికలు సంకోచిస్తాయి. కర్ణికల సంకొచం వలన రక్తం జటరికలు మధ్య వున్న కవాటలను తోసుకొని జటరికలోనికి ప్రవేశిస్తుంది.
3. జఠరికలు రక్తంతో నిందగానే సంకోచిస్తాయి. అదే సమయంలో కర్ణికలు యధాస్థితికి చేరుకుంటాయి.
4. జఠరికలు యధాస్థితికి చేరుకునే సమయంలో, జఠరికలలోని పీడనం తగ్గిపోతుంది. దీని వలన రక్తనాళాలోనికి ప్రవేశించి రక్తం వెనకకు రావటానికి ప్రయత్నిస్తుంది. రక్తనాళాలోని కవాటాలు మూసుకొని రక్తం వెనకకు జటరికలలోనికి రావటాన్ని నిరోదిస్తాయి. ఈ కవాటాలు మూసుకున్నపుడు రెండొవ ‘డబ్ ‘అనే శబ్దం చిన్నగా వస్తుంది.
ఇదే సమయానికి కర్ణికలు రక్తంతో నిండి మరలా సంకొంచానికి సిద్ధాపడుతాయి.
హృదయ స్పందనలో క్రమానుగతంగా జరిగే ఈ ప్రక్రియలన్నింటిని కలిపి హార్దిక వలయం అంటారు.
హార్దిక వలయంలో గుండె కండరాలు చురుకుగాను పాల్గొనే సంకొచక్రియ, విశ్రాంతి తీసుకొనే యధా పూర్వస్థితిలు ఒకదాని వెంట ఒకటి ఏర్పడుతువుంటాయి. ఈ మొత్తం ప్రక్రియ సుమారుగా 0.8 సెకన్లో పూర్తి అవుతుంది. కర్ణికల సంకొంచానికి పట్టే సమయం 0.11-0.14 సెకన్లు కాగా జటరికల సంకొచానికి 0.27-0.35 సెకన్లు సమయం పడుతుంది.
ఈ విధంగా రక్తం రక్తనాళలలోనికి నిరంతరం నియమిత కాలవ్యవధులలో ప్రవహిస్తుంటుంది. అయితే కణ జాలాలకు ప్రవహించే రక్తం నిరంతరాయంగా కాక, ఆగి ఆగి అలలు అలలుగా ప్రవహిస్తుంది. అందువలనే మనం మణి కట్టు వద్ద వేలు ఉంచినపుడు అక్కడ ఉన్న దమనిలో రక్తం ప్రవహించేటపుడు దాని ఒత్తిడి మనకు తెలుస్తుంది. దీనినే మనం నాడికోట్టుకోవటం అంటాం. మన నాడీ స్పందన రేటు, హృదయ స్పందన రేటుకి సమానంగా ఉంటుంది. రక్తం గుండె ద్వారా రెండుసార్లు ప్రవహిస్తే దానిని ద్వివలయ లేదా ధ్వంద్వవలయ ప్రసరణ అంటారు. ఈ విధంగా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ మరియు పోషకపదార్దాలు రక్త ప్రసరణ ద్వారా సరఫరా చేయబడతాయి.

ప్రస్తుతం గుండె జబ్బులు రావటానికి కారణాలు:

బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ధనిక దేశాల్లో గుండె జబ్బుల వలన చాలా మంది చనిపోవటం జరుగుతుంది అలానే ప్రతి వెయ్యి మందికి ఒకరు, చనిపోతున్నారు.500 వందల్లో ఒకరు ఈ వ్యాధి బాధపడటం జరుగుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త యంత్రాల ద్వారా గుండెపోటు వచ్చే వారిని చక్కగా పరీక్ష చేసి వారికి మందులు ఇచ్చి ఆరోగ్యవంతులుగా డాక్టర్స్ మార్చుతున్నారు. డాక్టర్స్ అందరికి ఈ విషయంలో ధన్యవాదములు తెలుపుతున్నాను.

జీవనశైలిలో మార్పురావటం వలన కూడా గుండె జబ్బులు రావటం జరుగుతుంది.

చక్కని ఆహారం, నిద్ర, ప్రశాంతమైన జీవనం గడపటంతో ఈ జబ్బు రాకుండా ఉంటుంది.

గుండె జబ్బు వచ్చే విధానంలో కొన్ని రకములు

1. ఛాతిమధ్యలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కత్తితో కోసినట్లు మెలివేసినట్లు తీవ్రంగా ఉంటుంది. హృదయ స్పందన హేచ్చుతగ్గులుంటాయి. రోగికి కంగారు ఎక్కువగా ఉండి మూర్చపోవటం కూడా జరుగుతుంది.

2. ఛాతిలో మంట, ఛాతి బరువుగా ఉండటం, నీరసం, అధికంగా చమటలు పట్టటం, నోరు ఎండిపోవటం, మొదలుగున్నవి కలిగి అపారస్మారక స్థితికి చేరును.

3. గుండె నొప్పి శరీరమంతా బరువు, దగ్గు, తెమడ, పడటం, రుచి మారటం.

4. వాతాపితకఫజ హృద్రోగ లక్షణములన్నియు ఇందులో కనిపిస్తాయి.

5. వాంతి రావటం, ఆకలి లేకపోవటం, తల నొప్పి, మరియు పాదాలు వాచి ఉండటం.

6. గుండె నొప్పి ఛాతి యందు కాక, ఛాతి ఎడమ భాగం, ఎడమ భుజానికి, ఎడమ చేతికి కూడా ప్రాకుతుంది. కొన్ని సార్లు కడుపు భాగంలో కూడా పాకుతుంది.

7. పడుకొని వున్న ఆయాసం వస్తుంది. చమటలు కూడా వస్తాయి
గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. మెట్లు లేదా ఎత్తు ఎక్కడం కష్టం అవుతుంది.

8. శరీరంలో నీరు అధికమై వాపు కలుగుతుంది. ఇది పాదాల మీది కనపడుతుంది. ఇవన్నీ గుండె జబ్బులు లక్షణములు.

గుండె జబ్బులు రావటానికి కారణాలు.

1. మద్యం తాగటం. పొగ తాగటం,

2. పాన్ పారాగ్, గుట్కాలు, తినటం.

3. అధిక కోపం, చింతా చికాకు,

4. అధికంగా వుండే కొవ్వు పదార్దాలు తినటం.

5. పిజ్జా, బర్గర్, నూడిల్స్, స్నాక్స్, విచ్చల విడిగా నోటికి అదుపు లేకుండా తినుట, అధిక బరువు పెరగడం, cool డ్రింక్స్, తాగటం,

6. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం,వాతావరణ కాలుష్యం, సరైన పోషకాపదార్దాలు తీసుకోకోపోవటం మానసిక ఒత్తిడి వలన, దీర్ఘాకాలిక జబ్బులకు medicine వాడిన,గుండె పోటు రావటం జరుగుతుంది.

నివారణ మార్గాలు:

1. ప్రతిరోజు ఉదయం వాకింగ్, లేదా యోగ, ఏరోబిక్, మార్షల్ ఆర్ట్స్ రన్నింగ్ ఎదో ఒకటి శరీరానికి 45 నిముషాలు వ్యాయామం చేయాలి.

2. సరైన సమయానికి భోజనం చేయాలి. మితంగా తినాలి. త్వరగా అరుగుదల అయ్యే ఆహారం తినాలి.

3. త్వరగా పడుకోవాలి, ఉదయం త్వరగా లేవాలి.

4. మానసిక ఒత్తిడి, నుండి లేకుండా చూసుకోవాలి.

5. అధిక మాంసాహాం, ఆల్కహాల్ తాగరాదు.

6. పొగ తాగటం, పాన్ పరాగ్, గోవా గుట్కా మానివేయాలి, జర్దాలు తినరాదు.

7. అధిక వ్యాయామం గుండెకు మంచిది కాదు.

8. కాలాన్ని బట్టి వచ్చే ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.

9. బయట రోడ్డు మీద దొరికే తిను బండారాలు మానివేయాలి.

10. యోగ, ప్రాణాయామం ధ్యానం, చేయాలి.

11. యోగలో

త్రికోనాశనం

గోముఖాసనం

ఉస్ట్రాసనం

భుజజంగాసనం

శలభాసనం

పాదోత్తాశనం

అమృతాసనం

ప్రాణాయామం.

ఉజ్జయిని.

అనులోమ విలోమ  ధ్యాన ముద్రచేయాలి.

త్రికోణాసనం చేయువిధానం: ముందుగా ప్రశాంతమైన వాతావరణంలో ఒక చక్కని ప్రదేశంలో నిలబడవేలెను.

1.ఆసనం మీద లేచి నిల్చొవాలి. కాళ్ళ మధ్య రెండు అడుగులు దూరం ఉండాలి. కుడిచేతిని కుడి చెవికి అనిస్తూ మీడిపైకేత్తాలి. ఊపిరి పిలుస్తూ ఆకాశం వైపు ఎత్తాలి. ఎడమ భుజం కిందికి ఉండాలి.

ఊపిరి వదులుతూ నెమ్మదిగా ఎడమ చేతిని కిందకు తీసుకొని వెళ్లి అర చెయ్యి భూమి మీద అనించాలి. కుడి అర చెయ్యి కిందవైపుకు ఉండి భూమికి సమానంతరంగా ఉండాలి. సాధ్యమైనంత సేపు ఈ భంగిమలోనే ఉండాలి. ఊపిరి పిలుస్తూ మెల్ల మెల్లగా వెనక్కి రావాలి. రెండొవ వైపు కూడా ఆచరించాలి. ధ్యానకేంద్రం మణిపుర చక్రం.

 

ఉపయోగాలు

1.గుండె ఊపిరితిత్తులు, పెంక్రీయాజ్, పెద్దపెగులు దీని వలన ప్రభావితం అవుతాయి.

2. శరీరం తేలిక అవుతుంది. వెన్నుముకతో పాటు దాని చుట్టు పక్కల వున్న కండరాలు బలపడుతాయి. కాళ్ళు చేతులు వీపు, మెడ, అన్ని బలంగా ఉంటాయి.

3. కాండరాలపైన ఒత్తిడి పడి, అక్కరలేని కొవ్వు కరిగిపోతుంది.

గోముఖాసనం.
ఈ ఆసనంలో మోకాళ్ళను, ఆవు ముఖాకారంలో ఉంచటం వలన దీనికి గోముఖాసనం అంటారు.

చేయు విధానం.
ముందుగా వజ్రాసనంలో కూర్చోని తరువాత ఎడమ కాలిని మడవాలి. మడమను గుద స్థానం కింద ఉంచాలి. కుడి కాలిని ఎలా మాడవాలంటే కుడిముడుకు కు,ఎడమ ముడుకుపైన, కుడి మడమ, ఎడమ పిరుద దగ్గరికి రావాలి. కుడి చేతిని వీపుమీది నుండి, ఎడమ చేతిని కింద నుండి తెచ్చి నడుము దగ్గర రెండు చేతులు వేళ్ళను పెనవేసి పట్టుకోవాలి. శ్వాసను సామాన్యంగా ఉంచాలి. మేడను తిన్నగా ఉంచాలి. కొద్దిసేపు ఈ ముద్రలోనే ఉండాలి. రెండొవ కాసలు మీద కూడా ఇదే పద్ధతిని ఆవలింభించాలి. చివర పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. ధ్యానకేంద్రం మూలధార చక్రం.

ఉపయోగాలు

హృదయ వ్యాధులన్నిటిని తగ్గిస్తుంది. తొడలు, పిక్కలు, కంఠం, భుజాల రోగాలు పోగొడుతుంది. ఛాతిని వెడల్పు చేస్తుంది.

-షేక్.బహర్ అలీ

ఆయుర్వేద వైద్యుడు,

సెల్ 7396126557

Leave A Reply

Your email address will not be published.