ఎన్నికల ప్రక్రియలో ప్రపంచ రికార్డు..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతం..

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యప్తంగా ఓటర్లు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయటం ఇదే ప్రథమం. ఈ సందర్బంగా ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాక ఈ
ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేయడంతో మనం ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపారు. రూ. 10 వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్ , మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. ఇది 2019లో ఈ సంఖ్య రూ. 3,500 కోట్లుగా ఉంది.
తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ ..
ఎపి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..