ఫైనల్‌కు దూసుకెళ్లిన నిఖత్..

ఢిల్లీ (CLiC2NEWS): ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపిన్ షిప్ టోర్నీలో నిఖత్ జరీన్ తన సత్తా చాటుతోంది. గురువారం సెమీ ఫైనల్ బౌట్‌లో తన ప్రత్యర్థి ఇంగ్రిత్ లొరెనా వాలెన్షియా విక్టోరియాపై 5-0 తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిఖత్‌తో పాటు లవ్లీనా (75 కేజీలు), నీతు గాంగాస్ (48 కేజీలు), స్వీటీ బూర (81 కేజీల) విభాగంలో సెమీస్‌లోకి ప్రవేశించారు. దీంతో భారత్‌కు మొత్తం నాలుగు పతకాలు ఖరారయ్యాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో 57 కేజీల విభాగంలో మనీషా.. 52 కేజీల విభాగంలో సాక్షి చౌదరి వెనుదిరిగారు.