రాంగ్ పార్కింగ్.. ఫొటో పంపితే రూ. 500 రివార్డ్
రాంగ్ పార్కింగ్‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త స్కీమ్
ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం వినూత్నమైన ఆలోచన చేసింది. రాంగ్ పార్కింగ్‌లో ఉన్న వాహనం ఫొటోను ఎవరైనా పంపితే.. వాహన దారుడికి వెయ్యిరూపాయల ఫైన్ పడితే.. పంపించిన వ్యక్తి రూ. 500 రివార్డు రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీని కోసం ఓ చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నాగ్‌పూర్‌లోని తన వంటతనికి రెండు వాహనాలు ఉన్నాయని, ఒక్కో కుటుంబానికి ఆరేసి వాహనాలు ఉంటున్నాయని తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ వాసులు అదృష్ట వంతులని.. పార్కింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా రహదారలు ఉన్నాయని పేర్కొన్నారు.