యాదాద్రికి ఒక్కరోజులో కోటికి పైగా ఆదాయం
యాదాద్రి (CLiC2NEWS): శ్రీ లక్ష్మీ నరసిహస్వామి వారి దేవస్థానానికి ఆదివారం ఒక్కరోజు రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. పవిత్ర కార్తీక మాసం, అందునా ఆదివారం సెలవుదినం కావడంతో ఇవాళ ఒక్కరోజే రూ.1,09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు యాదాద్రి చరిత్రలో రూ.కోటి మించి ఆదాయం రాలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యాదాద్రిని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడంతో భక్తుల సంఖ్య విశేషంగా పెరిగింది. దీనికి తోడు కార్తీక మాసం కావడంతో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది.
ఆలయంలో నిర్వహిస్తున్న వివిధ సేవలు, కౌంటరు విభాగాల ద్వారా ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,36,000, విఐపి దర్శనం టికెట్ల ద్వారా రూ.22,62,000, వ్రతాల ద్వారా రూ.13,44,000, కొండపైకి వాహనాల ప్రవేశం టికెట్ల ద్వారా రూ.10,50,000, బ్రేక్ దర్శనం టికెట్ల ద్వారా రూ.6,95,000 ఆదాయం సమకూరింది.