యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు..
Yashasvi Jaiswal : టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు (34) తీసిన క్రికెటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో నాథన్ లైయన్ బౌలింగ్‌లో యశస్వి సిక్సర్ బాదడంతో రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డున్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ (33) పేరిట ఉండేది. బ్రెండన్ 2014లో 33 సిక్సర్లు బాదాడు.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 90* పరుగులు చేయగా.. రాహుల్ 62* పరుగులు సాధించాడు.