రాష్ట్రపతి ఎన్నిక: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
ఢిల్లీ (CLiC2NEWS): రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సిపి అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో చర్చించాక యశ్వంత్ సిన్హా పేరును కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు జైరాం రమేష్ ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసేందుకు యశ్వంత్ సిన్హా కూడా సముఖత వ్యక్తం చేశారు. జూన్ 27వ తేదీ ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి అభ్యర్థిగా, యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎన్సిపి అధినేత శరద్ పవార్ వెల్లడించారు. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ నిర్వహించనున్నారు.