తెలంగాణ‌కు ఎల్లో అల‌ర్ట్..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా ఎండ‌లు పెర‌గ‌డంతో వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి 3 గంట‌ల వ‌ర‌కు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని హెచ్చరించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్ర‌త‌లు 43 డిగ్రీల సెల్సియ‌స్‌గా న‌మోద‌వుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఈ ఏడాది ఎండ‌లు అధికంగా ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) తెలిపింది. ఏప్రిల్ నుండి జూన్ వ‌ర‌కు సాధ‌ర‌ణం కంటే గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. మైదాన ప్రాంతాల్లో సాధార‌ణం కంటే ఎక్కువ వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.