టిఎస్పిఎఫ్ అకాడమీలో పోలీసులకు యోగా శిక్షణా కార్యక్రమం
హైదరాబాద్ (CLiC2NEWS): మనిషిలో శారీరక మానసిక శక్తిని పెంపొందించడమో కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుదల కోసం యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (TSPF) ట్రైనింగ్ అకాడమీ చీఫ్ ప్రిన్సిపాల్ (అడిషనల్ కమాండెంట్ ) దేవిదాసు అన్నారు.
హైదరాబాద్ లోని అమీనాపూర్ లోని తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం ట్రైనింగ్ అకాడమీ లో స్పెషల్ ఫోర్స్ పోలీసులకు ఆదివారం యోగాచార్యుడు షేక్. బహార్ అలీ ఆధ్వర్యంలో యోగ , ప్రాణాయామము శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (TSPF) ట్రైనింగ్ అకాడమీ చీఫ్ ప్రిన్సిపాల్ (అడిషనల్ కమాండెంట్ ) దేవిదాసు మాట్లాడుతూ..
మనిషిలో శారీరక మానసిక శక్తిని పెంపొందించడమో కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుదల కోసం యోగాలోని ప్రాణాయాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనలోని రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే ఏకైక మార్గమని అన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకం కలగకుండా, తమ విధి నిర్వహణలు సక్రమంగా చేసుకోవటానికి, శారీరక, మానసిక ఒత్తిడి నుండి విముక్తి కొరకు, డ్యూటీలో చురుకుగా ఉండేందుకు యోగా ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. ఆరోగ్యం కొరకు.. రోగాలు రాకుండా ఉండేందుకు.. బీపీ, షుగర్, లంగ్స్ ఇన్ఫెక్షన్, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, ఏసీడీటీ, ఇతర రోగాలు తగ్గించేందుకు యోగ, ప్రాణాయామం శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని అకాడమీ చీఫ్ ప్రిన్సిపాల్ దేవీదాసు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు, ఇన్స్పెక్టర్ రంజిత్, సబ్ ఇన్స్పెక్టర్ sk. మౌలాలి, instructor హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ బషీర్ తదితరులు పాల్గొన్నారు.
