AP: యోగాంధ్ర-2025 గిన్నిస్ రికార్డ్..
విశాఖ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమానికి గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. దేశవ్యాప్తంగా నేడు యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. దేశ ప్రతినిధులు, నాయకులు, మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు సైతం యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 గిన్నిస్ రికార్డ్ సాధించింది. విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్ నుండి భీమిలి వరకు 3.01 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొని ఈ రికార్డును సృష్టించారు. గతంలో సూరత్‌లో నిర్వహించిన యోగా రికార్డును (1.47 లక్షల మంది పేరిట) అధిగమించింది.
