హాలిడేస్‌కు టూర్‌కి విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా..

హాలిడేస్‌కు టూర్‌కి వెళ్లాలని అనుకుంటున్నారా..? మనదేశంలో అన్ని ప్రదేశాలు చూసేశారా..? ఈ సారి విదేశాలలోని అద్భుతమైన ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా! అయితే విదేశాలకు వెళ్లాలంటే వీసా అవసరం.అయితే వీసాతో పని లేకుండా మనదేశ ప్రజలకు ఇతర దేశాలలోని సుందరమైన ప్రదేశాలను చూసిరావచ్చని మీకు తెలుసా..? వీసా లేకుండా కొన్ని దేశాలు టూరిస్టులకు ఆహ్వానం పలుకుతున్నాయి. మలేషియా, బొలివియా, సమోవా, శ్రీలంక, కెన్యా, మారిషస్ , ఫిజి, భూటాన్, బార్బడోస్, జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా, టాంజానియా, జోర్డాన్, లావోస్, కాంబోడియా వంటి దేశాలకు వీసా లేకుండా చుట్టిరావచ్చు. ఈ దేశాలలో వీసా లేకుండా గరిష్టంగా 90 రోజులు అంటే మూడు నెలలు వరకు పర్యటించవచ్చు.