థాయ్‌లాండ్‌లో పర్యాటక ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా..!
పర్యాటకులకు శుభవార్త.
బ్యాంకాక్ (CLiC2NEWS): థాయ్‌లాండ్ వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. వీసా లేకుండా 30 రోజులపాటు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చు. భారత్, తైవాన్ దేశాల వారు వీసా లేకుండా థాయ్‌లాండ్‌లో నెల రోజులపాటు పర్యటించవచ్చు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మలేసియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్ నుండే ఎక్కువ మంది పర్యాటకులు థాయిలాండ్ కు వెళ్తుంటారు. తమ దేశానికి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు వీసా మినహాయింపు ఇచ్చింది. నవంబర్ 10 నుండి వచ్చే ఏడాది మే 10 వరకు ఈ విధానం అమలులో ఉండనుంది. ఇటీవల శ్రీలంక కూడా భారత్ సహా ఏడు దేశాల పర్యాటకులకు వీసా మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.