నెల్లూరులో విషాదం.. యువ దంపతులు ఆత్మహత్య..

నెల్లూరు (CLiC2NEWS): కుటుంబ కలహాలతో యువ దంపతులు ఆత్మహత్య చేసుకోగా.. వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారినవైనం స్థానికులను కలిచవేస్తుంది. ఈ ఘటన నెల్లూరు నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని 11వ డివిజన్‌లో ఎన్‌టిఆర్ నగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో కాకర్ల నాగరాజు (21) , సురేఖ (19) దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. నాగరాజు టైల్స్ బిజినెస్ చేసేవాడు. సురేఖ బ్యూటిషియన్‌గా పనిచేస్తుంది. వీరిది ప్రేమవివాహం. ఇటీవల నాగరాజు మద్యానికి బానిసవడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరగడంతో భర్తను మద్యం మానేయాలని వారించింది. వినకపోవడంతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు .. భార్య మృతికి తనే కారణమని తలచి రైలుకిందపడి ఆదివారం మృతి చెందాడు. దీంతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు.