యువ శక్తిని వృథా కానివ్వకూడదు..
-డా.హిప్నో పద్మా కమలాకర్

హైదరాబాద్ (CLiC2NEWS): నేటి ప్రేమలు… హాయ్, బాయ్ టైపులోనే ఉంటున్నాయని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, కోశాధికారి పి.స్వరూప రాణి, గైనకాలజిస్ట్ డా.కె.నాగేశ్వరీరావు సంయుక్తంగా తెలిపారు. ఫిబ్రవరి 14 వాలెంటైన్ డే సందర్భంగా శుక్రవారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ హాల్లో మీడియాతో మాట్లాడారు.
నేటి యువత ప్రేమనే పద్మ వ్యూహం లో చిక్కుకొని విలవిల్లాడు తున్నారన్నారు. పెద్దలు అమ్మాయిలకు 12 సంవత్సరాలు రాగానే ఆంక్షలు, అబ్బాయిల్ని స్వేచ్ఛగా వదలటం తోనే ప్రేమనే ఆకర్షణ వైపు తొంగి చూస్తున్నారన్నారు. ప్రేమ భారతదేశంలోనే కాక ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ప్రేమ మరణంలేనిదన్నారు. ప్రేమ ఇచ్చి పుచ్చుకోవడం లో లేదని, ఎదుటవాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకోవటం లోనే ప్రేమ ఉంటుందన్నారు. ఎప్పుడూ ఎదుటవాళ్ళని ప్రేమించటమేనా మీమ్మలని ప్రేమించుకోంటె దాని విలువ బాగా తెలుస్తుందన్నారు. నీ ప్రేమను ఇవ్వాలంటే ఇవ్వు, ఎదుటవాళ్ళ ప్రేమను లాక్కొనే హాక్కు లేదన్నారు. ఇతరులను ప్రేమించడం సులభమే, నిన్ను నీవు ప్రేమించుకోవడమే చాలా కష్టమన్నారు.
యువ శక్తిని వృథాకానివ్వకూడదు.
జీవితంలో యువతను, కౌమరం నుంచి యవ్వనం దశలో ప్రేమ ఆకర్షిస్తుందన్నారు. ఈ ఆకర్షణ పరవశం కలిగిస్తుందని, ఆ ప్రేమ పారవశ్యంలో ఒకరిని విడిచి ఒకరు జీవించలేని పరిస్థితి తల ఎత్తుతుందన్నారు. బయటవారికి అది ఉన్మాదం లా కనపడుతుందన్నారు.అదే విధంగా దేశ ప్రేమ, ఆత్మీయులని ప్రేమించడం అన్నింటినీ మించి యువతి యువకుల మధ్య ప్రేమ కూడా సమాజంలో గుర్తింపు పొందుతుందన్నారు.
పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెద్దలు మొండి పట్టుదలకు పోకుండా యువత సమస్యలు పరిష్కరించడం మంచిదని తెలిపారు. దేశాభివృద్ధికి, సమాజ సంక్షేమానికి యువ శక్తి ఉపయోగపడేటట్లు మనమంతా కృషి చేయాలన్నారు. దేశభక్తితో, మానవాళిపై అవధులులేని ప్రేమతో, పవిత్రమైన బాటలో నడిచేలా యువత ఉండాలన్నారు. దేశాభివృద్ధికి, సమాజ సంక్షేమానికి యువత శక్తి ఉపయోగపడేటట్లు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.